భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగాజనాభా తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచంలోఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించినది.
దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములోఅధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. దక్షిణాన హిందూ మహాసముద్రం, నైరుతిన అరేబియా సముద్రం, మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్,బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్[1]దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక,మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్నిపురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చినది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1947 లో బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది.
భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశం గా భావిస్తారు. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం, మరియు తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక అణ్వాయుధ మరియు ప్రాంతీయ శక్తి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక ఫెడరల్ రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.
National symbols of the Republic of India (Official)National animalNational birdNational treeNational flowerNational heritage animalNational aquatic marine mammalNational reptileNational heritage mammalNational fruitNational templeNational riverNational mountain
పేరు పుట్టుపూర్వోత్తరాలుసవరించు
ముఖ్య వ్యాసము: భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు
భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే......). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చినది.
ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతనువిశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతలయొక్క కుమారుడు.
తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధుానది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధుానదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు. తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారతదేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూదేశం యొక్క రూపాంతరమే!
చరిత్రసవరించు
అశోకుడిచే క్రీ.పూ.3 వ శతాబ్దంలో మధ్య ప్రదేశ్ లోని సాంచీలో నిర్మించబడిన స్థూపం.
ముఖ్య వ్యాసము: భారతదేశ చరిత్ర
మధ్య ప్రదేశ్ లోని భింబెట్కా వద్ద లభ్యమైనరాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. క్రి.పూ. 7000 సమయంలో, మొట్టమొదటి నియోలిథిక్ స్థావరాలు పశ్చిమ పాకిస్తాన్ లో మెహర్గర్ మరియు ఇతర ఉపఖండపు ప్రాంతాల్లో కనిపించింది. ఈ విదంగా సింధుాలోయ నాగరికత అభివృద్ధి, దక్షిణ ఆసియా లో మొదటి పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఇదేక్రీ.పూ.26 వ శతాబ్దం మరియు క్రీ.పూ.20 వ శతాబ్దంమధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత.క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు,చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రము, కళలు, సారస్వతం,భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రంమొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.
రెండవ సహస్రాబ్ది మధ్యలో, పోర్చుగల్, ఫ్రాన్స్,ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపితమహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘస్వాతంత్ర్య సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15నభారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.
విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం - జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. 1975, 1977మధ్యకాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీవిధించిన ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే పౌర హక్కులకుభంగం వాటిల్లింది. భారత దేశానికి చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా 1962లో యుద్ధంజరిగింది. పాకిస్తాన్తో 1947, 1965, మరియు1971లోను యుద్ధాలు జరిగాయి. అలీనోద్యమంలోభారతదేశం స్థాపక సభ్యురాలు. 1974లో, భారత్ తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. 1998లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. 1991లో జరిగిన ఆర్ధిక సంస్కరణలతో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.
నృసింహావతారం లో ఉన్న విష్ణుమూర్తి.
ఇంకా చూడండి:
భారతదేశ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలుభారతదేశ సైనిక చరిత్ర
ప్రభుత్వము మరియు రాజకీయాలుసవరించు
ప్రధాన వ్యాసము: భారత రాజకీయ వ్యవస్థ
భారత దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 26 జనవరి 1950న అవతరించింది. భారత రాజ్యాంగంప్రకారం అధికారం లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ, నిర్వహణ వ్యవస్థల ద్వారా అమలవుతుంది.
ఇది పలు రాష్ట్రాల సమాఖ్య. దేశాధినేత అయినరాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతులు పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజిద్వారా ఐదేళ్ళ కాలపరిమితికి ఎన్నుకోబడతారు.
ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధికారాలు గల పదవి.లోక్‌సభలో అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ, లేదాసంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది. ప్రధానమంత్రి సలహా మేరకు, రాష్ట్రపతిచే నితమించబడ్డమంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకంగా ఉంటుంది. మంత్రులచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
భారత దేశపు శాసన వ్యవస్థలో ద్విసభా పద్ధతి ఉంది. ఎగువ సభను రాజ్య సభ అని, దిగువ సభను లోక్ సభఅని అంటారు. లోక్ సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. రాజ్య సభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీద్వారా ఎన్నుకోబడతారు.
న్యాయవ్యవస్థ లో పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు, మరియు అప్పిలేట్ కోర్టులు, హైకోర్టులు ఉంటాయి. కోర్టులకు సూచనలు, ఆదేశాలు, రిట్లు ఇచ్చే అధికారం ఉంది. రిట్లలో హెబియస్ కార్పస్,మాండమస్, నిషేధం, కోవారంటో మరియుసెర్టియోరారి అనే వివిధ రకాలుగా ఉన్నాయి. భారతీయ కోర్టులు రాజ్యాంగ శక్తులు; ఇవి రాజకీయ జోక్యం లేనివి. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు అరుదుగా ఏర్పడే ఘర్షణను రాష్ట్రపతి మధ్యవర్తిత్వం వహించి నివారిస్తారు.
స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. 1977లో జనతా పార్టీ గా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలోఅత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన భాజపా ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా1996 తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి పదిశాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం.
ఇంకా చూడండి :
భారత దేశపు రాజకీయ పార్టీలుభారత ఎన్నికల విధానంకేంద్ర మంత్రుల జాబితాభారత దేశ అంతర్జాతీయ సంబంధాలు
భౌగోళిక స్వరూపము, వాతావరణంసవరించు
భారతదేశం విశిష్ట లక్షణాలు గల ఒక ఉపఖండం అని పేర్కొనవచ్చు. భారతదేశంలో అనేక భౌతిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక తారతమ్యాలున్నాయి. భారతదేశంలో ఆనాది నుంచి అనేక మతాలు, జాతులు, కులాలు,భాషలు, కులాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉండుటచే దీన్ని భౌగోళిక బిన్నత్వంలో ఏకత్వంగల దేశంగా గుర్తించవచ్చు.
హిమాలయాలు ఉత్తరాన జమ్మూ కాశ్మీరు నుండి తూర్పునఅరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి భారత దేశపు ఉత్తర సరిహద్దుగా విలసిల్లుతున్నాయి.
భారతదేశం, ఉపగ్రహ చిత్రం.
భారతదేశపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. మిగిలిన ఉత్తర భారతం, మధ్య, ఈశాన్య ప్రాంతాలు సారవంతమైనగంగా మైదానంతో కూడి ఉన్నాయి. పశ్చిమాన,పాకిస్థాన్ కు ఆగ్నేయ సరిహద్దున థార్ ఎడారి ఉన్నది. దక్షిణ భారత ద్వీపకల్పం దాదాపు పూర్తిగా దక్కను పీఠభూమితో కూడుకుని ఉంది. ఈ పీఠభూమికి రెండువైపులా తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలుఉన్నాయి.
భారతదేశంలో ఎన్నో ప్రముఖ నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని: గంగ, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ,గోదావరి.
దేశపు దక్షిణాన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరానసమశీతోష్ణ వాతావరణం నెలకొని ఉంది. హిమాలయ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం (టండ్రా) ఉంది. భారత దేశంలో వర్షాలు ఋతుపవనాలు వలన కలుగుతాయి.
ఇంకా చూడండి :
భారతదేశ వాతావరణంభారత జాతీయ వనాలు
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుసవరించు
ప్రధాన వ్యాసము: భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశము 29 రాష్ట్రాలుగా విభజించబడినది. (రాష్ట్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), ఆరుకేంద్రపాలిత ప్రాంతములు మరియు జాతీయ రాజధాని ప్రాంతము,ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంతmga ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.
రాష్ట్రములు:
ఆంధ్ర ప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్అస్సాంబీహార్చత్తీస్ గఢ్గోవాగుజరాత్హర్యానాహిమాచల్ ప్రదేశ్జమ్మూ మరియు కాశ్మీర్జార్ఖండ్కర్ణాటకకేరళమధ్య ప్రదేశ్మహారాష్ట్రమణిపూర్మేఘాలయమిజోరాంనాగాలాండ్ఒడిషాపంజాబ్రాజస్థాన్సిక్కింతమిళనాడుతెలంగాణత్రిపురఉత్తరాఖండ్ఉత్తర ప్రదేశ్పశ్చిమ బెంగాల్
కేంద్రపాలిత ప్రాంతములు:
A అండమాన్ మరియు నికోబార్ దీవులుB ఛండీగఢ్C దాద్రా నాగర్ హవేలీD డామన్ మరియు డయ్యుE లక్షద్వీపములుF పాండిచ్చేరి
జాతీయ రాజధాని ప్రాంతము:
భారతదేశము అంటార్క్‌టికాలో territorial claim చేయలేదు కానీ దక్షిణ గంగోత్రి మరియు మైత్రి అను రెండు శాస్త్రీయ స్థావరాలు కలవు.
చూడండి: జనాభా వారిగా భారతదేశ రాష్ట్రాల జాబితా
ఆర్ధిక వ్యవస్థసవరించు
ప్రధాన వ్యాసము: భారత ఆర్ధిక వ్యవస్థ
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క ఆర్ధికవ్యవస్థ, ద్రవ్య మారకం పరంగా ప్రపంచంలోనే పదో పెద్ద వ్యవస్థ. పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం ఇది నాలుగో స్థానంలో ఉంది. 2003 లో అత్యధిక వృద్ధి రేటు - 8 శాతం - నమోదు చేసుకుంది. అయితే, అధిక జనాభా కారణంగా, పి.పి.పి ప్రకారం తలసరి ఆదాయం కేవలం 2,540 డాలర్లుగా ఉంది; ప్రపంచ బాంకు జాబితాలో ఇది 143 వ స్థానం. భారత విడేశీమారక నిల్వలు 30 వేల 900 కోట్ల డాలర్లు. దేశానికి ఆర్ధిక రాజధానిగా ముంబై నగరం భాసిల్లుతోంది. భారతీయ రిజర్వ్ బాంక్ కేంద్ర కార్యాలయం, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇక్కడే ఉన్నాయి. 25% ప్రజలు ఇంకాదారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం విస్తరణ కారణంగా మధ్య తరగతివర్గం విస్తరిస్తోంది.
1300 కోట్ల డాలర్ల ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ భారత్ లోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. చిత్రంలో ఉన్నది అగ్రశ్రేణి ఐ.టి సంస్థ,ఇన్‌ఫోసిస్.
చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడినవ్యవసాయం పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు గనులు, పెట్రోలియం, వజ్రాలు,సినిమాలు, జౌళి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, మరియు హస్త కళలు. భారత్ దేశపు పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003-2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. అమెరికా, చైనా, యు.ఏ.ఇ మరియుఐరోపా సమాఖ్యలు భారత దేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు.
ఇంకా చూడండి : భారతీయ కంపెనీల జాబితా
జనాభా వివరాలుసవరించు
ప్రధాన వ్యాసము: భారత జనాభా వివరాలు
భారత దేశము, చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై(వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్కతా (వెనుకటి కలకత్తా), మరియు చెన్నై (వెనుకటి మద్రాసు ), హైదరాబాద్
భారత దేశం యొక్క ఆక్షరాస్యత 74.04%, ఇందులో పురుషుల అక్షరాస్యత 82.14% మరియు మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు.
దేశంలోని 80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభా ఇక్కడ ఉన్నారు. (13.4%). ఇతర మతాలు: క్రైస్తవులు(2.33%), సిక్కులు (1.84%), బౌద్ధులు (0.76%),జైనులు (0.40%), యూదులు, పార్సీలు,అహ్మదీయులు, మరియు బహాయీలు. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో పండుగలుఅందరూ కలిసి జరుపుకుంటారు. వీటిలో బాగా విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలుశ్రీరామనవమి,వినాయక చవితి,సంక్రాంతి,దీపావళి,హొలీ మరియు దసరా.
భారత దేశం రెండు ప్రముఖ భాషా కుటుంబాలకుజన్మస్థానం. అవి, ఇండో-ఆర్యన్ మరియు ద్రావిడ భాషలు. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలలో హిందీ, ఇంగ్లీషు భాషలను ఉపయోగిస్తుంది. దేశంలోని నాలుగు ప్రాచీన భాషలుసంస్కృతం, తెలుగు,కన్నడం మరియు తమిళం. దేశంలో మొత్తం 1652 మాతృ భాషలు ఉన్నాయి.
భారత దేశములో 11 పెద్ద నగరాలుసవరించు
ముంబాయిఢిల్లీకోల్కతాచెన్నైహైదరాబాదుబెంగుళూరుఅహమ్మదాబాదుపూణేకాన్పూర్సూరత్విజయవాడవిశాఖపట్నంతిరుపతి
ప్రాచీన భారతంలో రవాణా వ్యవస్థసవరించు
రవాణా సౌకర్యాలుసవరించు
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించే రవాణా సౌకర్యాలలో భారత దేశం మంచి ప్రగతిని సాధించింది. మొత్తం 4 రకాల రవాణా సౌకర్యాలు భారత దేశంలో కలవు.
రైలు మార్గాలుసవరించు
దేశంలో రైలు మార్గాలు అతిముఖ్యమైన రవాణా సౌకర్యము. 1853 లో ముంబాయి నుండి థానేమధ్య ప్రారంభమైన రైలు మార్గము ప్రస్తుతం 62 వేల కిలోమీటర్లకు పైగా నిడివిని కల్గి ఉంది. భారతీయ రైల్వే17 జోన్లుగా విభజితమై ఉంది.
అఖండ భారత్ రైలుసవరించు
ఢాకా-ఢిల్లీ-లాహోర్ రైలు.ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య తిరిగే రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. దక్షిణాసియా దేశాల మధ్య రైలు సర్వీసులు ప్రారంభించాలనే భారత ప్రతిపాదనకు పాకిస్థాన్ పచ్చజెండా వూపింది. మూడు దేశాలను కలుపుతూ రైళ్లను నడిపిస్తామని భారత రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు పాక్ రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతిక అనుమతిని మంజూరు చేసింది.ఢాకా-ఢిల్లీ-లాహోర్‌ల మధ్య రైలు నడిపించటం లాభదాయకమేననీ, అవసరమైతే కరాచీ, ఇస్లామాబాద్ వరకూ పొడిగించుకోవచ్చని నిపుణులు సూచించినట్లు పాక్ రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా కంటైనెర్ రైళ్లను నడిపించి, తర్వాతి దశలో ప్రయాణికుల బండ్లను నడిపించాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఇస్లామాబాద్-టెహ్రాన్-ఇస్తాంబుల్ రైలు సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేయటంతో భారత రైల్వేశాఖకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. దక్షిణాసియా రైళ్ల వల్ల పాకిస్థాన్, ఇతర సార్క్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని మనదేశం ప్రతిపాదనల్లో వెల్లడించింది. దీనివల్ల నేపాల్, భూటాన్ వంటి దేశాలకూ రైలు సర్వీసులు నడిపించవచ్చని సూచించినట్లు తెలిసింది.దక్షిణాసియా రైలు సర్వీసులు వాణిజ్యపరంగా ప్రయోజనకరమేనని నిపుణులు సైతం కితాబునిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్లను నడిపించటమూ తేలికేననీ పేర్కొంటున్నారు. భారత్, పాక్, బంగ్లాదేశ్‌లలో బ్రిటిష్ పాలకులు రైలు మార్గాలను నిర్మించినందువల్ల మూడు దేశాల్లోనూ బ్రాడ్‌గేజి రైలు పట్టాలు ఉండటం, నిర్వహణ శైలీ ఒకేమాదిరిగా ఉండటం కలిసివస్తుందని అభిప్రాయపడుతున్నారు.[2]
రోడ్డు మార్గాలుసవరించు
మారుమూల ప్రాంతాలకు కూడ విస్తరించిన రవాణా మార్గాలు రోడ్డు మార్గాలే. రోడ్డు మార్గాలలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు,గ్రామ పంచాయతి రహదారులు అని 4 రకాలు. దేశంలోని మొత్తం రోడ్ల నిడివిలో కేవలం 2% ఆక్రమించిన జాతీయ రహదారులు, ట్రాపిక్ లో మాత్రం సుమారు 40% ఆక్రమిస్తున్నాయి.
వాయు మార్గాలుసవరించు
ఆతి వేగంగా జరిగే రవాణా వ్యవస్థగా వాయు మార్గాలు పస్రిద్ధి చెందాయి. మనదేశంలో రాష్ట్ర రాజధానులు మరియు ప్రధాన పట్టణాలను కల్పుతూ విమాన మార్గాలు కలవు. ఇది అధిక వ్యయంతో కూడుకొనినప్పటికినీ సౌకర్యవంతంగా మరియు అతి వేగంగా ఉంటుంది. కేవలం దేశంలోని పట్టణాలు, నగరాలనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలనుండి ఇతరదేశాలను కూడ కల్పే అంతర్జాతీయ విమానాశ్రయాలు కలవు.
జల మార్గాలుసవరించు
జల మార్గాలు రవాణా సౌకర్యాలలో ఆలస్యం అయినప్పటికినీ తక్కువ ఖర్చుతో కూడుకునది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ముడి చమురు, ఇతర ఖనిజాలు తెప్పించుకోవడానికి, మనదేశం నుంచి ఇతరదేశాలకు ముడి ఇనుము, ఇతర ఖనిజాలు ఎగుమతి చేయడానికి ఈ రవాణా మార్గం చాలా అనువైనది.
ఇంకా చూడండి :
భారతీయ భాషలు - మాట్లాడే ప్రజల సంఖ్యభారతీయ నగరాలు, పట్టణాలుభారత దేశంలో మతములు
భారత దేశము - కొన్ని ముఖ్య విషయాలుసవరించు
విస్తీర్ణం పరంగా ప్రపంచము లో 7 వ పెద్ద దేశంజనాభా పరంగా ప్రపంచము లో 2 వ పెద్ద దేశముఒక దేశం పేరుమీదుగా మహాసముద్రం ఉన్న ఏకైక దేశంఅత్యధిక ప్రధాన మతాలకు పుట్టినిల్లయిన దేశం7,517 కిమీ సముద్రతీరం కలదు
సంస్కృతిసవరించు
ప్రధాన వ్యాసము: భారతీయ సంస్కృతి
ఆగ్రా లోని తాజ్‌మహల్ - భారతదేశపు అత్యంత ప్రజాదరణ కలిగిన పర్యాటక స్థలం
బౌద్ధుల సంవత్సరాది — లోసార్ నాడు టిబెటు బౌద్ధులు చేసే గుంపా నృత్యం.
భారత దేశం తన ఉత్కృష్టమైన, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని, తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చింది. ఆక్రమణదారులు, వలస వచ్చినవారి సాంప్రదాయాలను కూడా తనలో ఇముడ్చుకుంది. తాజ్‌మహల్ వంటి కట్టడాలు, మరెన్నో సంస్కృతీ, సాంప్రదాయాలు మొగలుపాలకులనుండి వారసత్వంగా స్వీకరించింది.
భారతీయ సమాజము భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో కూడిన బహుళ సమాజం. వివిధ మత కార్యక్రమాలు సంఘ దైనందిన జీవితంలో ఒక భాగం. అన్ని సామాజిక, ఆర్ధిక వర్గాలలోను విద్యను ఉన్నతంగా భావిస్తారు. సాంప్రదాయికమైన సమష్టి కుటుంబ వ్యవస్థలోని ఆర్ధిక అవరోధాల దృష్ట్యా చిరు కుటుంబాలు ఎక్కువైపోతున్నప్పటికీ, సాంప్రదాయిక కుటుంబ విలువలను పవిత్రంగా భావిస్తారు, గౌరవిస్తారు.
భారతీయ సంగీతం వివిధ రకాల పద్ధతులతో కూడినది.శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధాన పద్ధతులున్నాయి. దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతం ఒకటి కాగా, ఉతరాదికి చెందిన హిందూస్తానీ సంగీతము రెండోది. ప్రజాదరణ పొందిన మరో సంగీతం సినిమా సంగీతం. ఇవికాక ఎన్నో రకాల జానపద సంగీత సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. శాస్త్రీయ నృత్య రీతులు కూడా ఎన్నో ఉన్నాయి – భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, కథక్,కథకళి మొదలైనవి. ఇవి ఇతిహాసాలపై ఆధారపడిన కథనాలతో కూడి ఉంటాయి. ఇవి ఎక్కువగా భక్తి, ఆధ్యాత్మికత మేళవింపబడి ఉంటాయి.
ప్రాచీన సారస్వతం ఎక్కువగా మౌఖికమైనది. తరువాతి కాలంలో అది అక్షరబద్ధం చేయబడింది. దాదాపుగా ఇవన్నీ కూడా హిందూ సంస్కృతిలో నుండి ఉద్భవించినవే. పవిత్ర శ్లోకాలతో కూడిన వేదాలు,మహాభారతం మరియు రామాయణం వీటిలో ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సంగమ సాహిత్యం భార్తదేశపు ప్రాచీన సాంప్రదాయిక లౌకిక తత్వానికి అద్దం పడుతుంది. ఆధునిక కాలంలో, భారతీయ భాషలలోను, ఇంగ్లీషు లోను కూడా రాసిన ప్రసిద్ధి చెందిన రచయితలెందరో ఉన్నారు. నోబెల్ బహుమతి సాధించిన ఒకేఒక భారతీయుడైన రవీంద్రనాథ్ టాగోర్బెంగాలీ రచయిత.
ప్రపంచంలొనే అత్యధికంగా సినిమాలు నిర్మించేది భారతదేసమే. దేశంలో అన్నిటికంటే ప్రముఖమైనదిముంబైలో నెలకొన్న హిందీ సినిమా పరిశ్రమ. అధిక సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్న ఇతర భాషా పరిశ్రమలు - తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియుబెంగాలీ. బెంగాలీ సినిమా దర్శకుడైన సత్యజిత్ రేప్రపంచ సినిమా రంగానికి భారత్ అందించిన ఆణిముత్యం.
వరి అన్నం మరియు గోధుమ (బ్రెడ్, రొట్టెల రూపంలో)లు ప్రజల ముఖ్య ఆహారం. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడినభారతీయ వంటలు ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార వంటలకు దేశం ప్రసిద్ధి చెందింది. భారతీయ ఆహార్యం కూడా ఆహారం వలెనే బహు వైవిధ్యమైనది.చీర, సల్వార్ కమీజ్ స్త్రీలు ఎక్కువగా ధరించే దుస్తులు. పురుషులు పంచె, కుర్తా ధరిస్తారు.
ఇంకా చూడండి :
భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాభారతీయ శిల్పకళభారతీయుల ఇంటిపేర్లుభారతీయ వంటకాలు
క్రీడలుసవరించు
ప్రధాన వ్యాసము: భారతదేశంలో క్రీడలు
జనాభా పరంగా రెండో పెద్ద దేశమైననూ ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి సముచిత స్థానం లేదు.జాతీయ క్రీడ గా హాకీ ఉన్ననూ దాని ఘనత గతమే.ఒలంపిక్ క్రీడలలో 8 పర్యాయాలు బంగారు పతకాలు సాధించిన భారత దేశానికి ప్రస్తుతం చెప్పుకోదగిన ఘనత లేదు. ఇక అత్యధిక ప్రజాదరణ ఉన్న క్రీడ క్రికెట్లో అప్పుడప్పుడు మెరుపులు సాధించిననూ అపజయాలే ఎక్కువ. 1983 ప్రపంచ కప్ , 1984ఆసియా కప్, 1985 బెన్సన్ హెడ్జెస్ కప్, తర్వాత ఇటీవల ధోనీ సేన సాధించిన ట్వంటీ-20 వరల్డ్ కప్ మరియు 2011 ప్రపంచ కప్ చెప్పుకోదగిన విజయాలు.క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఎక్కువ పరుగులు మరియు ఎక్కువ సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్. . చదరంగం లో విశ్వనాథన్ ఆనంద్ రెండు పర్యాయాలు ప్రపంచ టైటిల్ సాధించగా, టెన్నిస్ లో లియాండర్ పేస్,మహేష్ భూపతి, సానియా మీర్జా లు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు సాధించిపెట్టారు.ప్రస్తుతము ఆడుతున్నవార్లలోసైన నెహవల్ చెప్పుకోదగినది. భారతదేశము ఒలింపిక్ క్రీడలు లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే పతకం సాధించగలిగినది. ఆసియా క్రీడలలో కూడ చిన్న చిన్న దేశాల కంటే మన పతకాలు చాలా తక్కువ. కబడ్డీ లో మాత్రం వరుసగా బంగారు పతకాలు మనమే సాధించాము.
కొన్ని సాంప్రదాయ ఆటలు అయిన కబడ్డీ, ఖో-ఖోమరియు గోడుంబిళ్ళ (గిల్లీ-దండా)లకు దేశమంతటా బహుళ ప్రాచుర్యము ఉన్నది. చదరంగము, క్యారమ్,పోలో, మరియు బ్యాడ్మింటన్ మొదలైనటువంటి అనేక క్రీడలు భారతదేశంలో పుట్టాయి. ఫుట్‌బాల్ (సాకర్) కు కూడా యావత్ భారతదేశంలో చాలా ప్రజాదరణ ఉన్నది.
జాతీయ చిహ్నములుసవరించు
ప్రధాన వ్యాసం: భారత జాతీయతా సూచికలు
జాతీయ పతాకము : త్రివర్ణ పతాకముజాతీయ ముద్ర : మూడు తలల సింహపు బొమ్మజాతీయ గీతం : జనగణమన....జాతీయ గేయం : వందేమాతరం....జాతీయ పక్షి : నెమలిpavokristatasజాతీయ జంతువు : పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్)జాతీయ వృక్షం : మర్రిచెట్టుజాతీయ క్రీడ : హాకీజాతీయ పుష్పం : కమలము(తామర)జాతీయ క్యాలెండర్ : శక క్యాలెండర్ (శక సం.పు క్యాలెండర్)జాతీయ ఫలం : మామిడి పండు
No comments:
Post a Comment